News23rd Jan 11:49 AMSunil Byrisetty1 min read
లైసెన్స్‌లో అడ్రస్ మార్పు?.. ఆన్‌లైన్‌లో ఈజీగా!
డ్రైవింగ్ లైసెన్స్‌లో చిరునామాను మార్చుకోవడాన్ని సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. స్వస్థలం నుంచి వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు ఆన్‌లైన్‌లో అడ్రస్ మార్చుకునేంద
డ్రైవింగ్ లైసెన్స్‌లో చిరునామాను మార్చుకోవడాన్ని సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. స్వస్థలం నుంచి వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు ఆన్‌లైన్‌లో అడ్రస్ మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ‘పరివహన్’ పోర్టల్ ద్వారా ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే సులభతరం చేసింది. దరఖాస్తుదారులు ముందుగా పరివహన్ సేవా (parivahan.gov.in) వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ 'ఆన్‌లైన్ సర్వీసెస్' విభాగంలో 'డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవలు' ఎంచుకోవాలి. అనంతరం, తాము నివసిస్తున్న రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుని, 'చేంజ్ ఆఫ్ అడ్రస్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. డీఎల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేశాక, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, నిర్ణీత రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఈ విధానం వల్ల ఆర్టీవో ఆఫీసు చుట్టూ తిరిగే అవసరం లేకుండా లైసెన్స్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.