Education18th Dec 02:56 PMSunil Byrisetty1 min read
ఇంటర్ మార్కుల కేటాయింపులో మార్పులివే
ఏపీలో ఇంటర్ పరీక్షా విధానంలో బోర్డు మార్పులు చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. జాతీయ విద్యా వి
ఏపీలో ఇంటర్ పరీక్షా విధానంలో బోర్డు మార్పులు చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేస్తుంది. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, చరిత్ర, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్ సిలబస్‌లో ఈ ఏడాది మార్పులు చేశారు. ఈ సబ్జెక్టుల్లో ప్రతి పేపర్‌కు 100 మార్కులకు పరీక్షలు ఉంటాయి. ఒక్క మార్కు ప్రశ్నల విధానం ప్రవేశపెట్టారు. ఇక పరీక్షలు రాసేందుకు జవాబుల బుక్‌లెట్‌ను కూడా 32 పేజీలకు పెంచారు. సిలబస్ మారని సబ్జెక్టులకు మాత్రం 24 పేజీల బుక్‌లెట్‌నే కొనసాగిస్తున్నారు. ఒక్కో పరీక్షకు కనీసం 2 రోజుల వ్యవధి ఉండేలా టైంటేబుల్ రూపొందించారు. 2025-26 విద్యా సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఇంటర్ పరీక్షల్లో మాత్రమే ఈ మార్పులు చేశారు. సెకండ్ ఇయర్ పరీక్షలు మాత్రం ఈ ఏడాదికి పాత విధానంలోనే జరుగుతాయి.