News22nd Dec 01:17 PMSunil Byrisetty1 min read

మారుతున్న అమరావతి రూపురేఖలు

ఏపీ రాజధాని రూపురేఖలు మారుతున్నాయి. అమరావతి పరిధి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే పనులను ముమ్మరం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. రూ.900 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు డీపీ

మారుతున్న అమరావతి రూపురేఖలు
ఏపీ రాజధాని రూపురేఖలు మారుతున్నాయి. అమరావతి పరిధి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే పనులను ముమ్మరం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. రూ.900 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు డీపీఆర్‌ సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసిందని.. వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామన్నారు. 6 నెలల్లో గ్రామాల్లోని పనులన్నీ పూర్తిచేస్తామని వివరించారు. సోమవారం వడ్డమానులో రహదారిని ప్రారంభించారు. రాజధానిని గుంటూరు, విజయవాడ సహా పలు ప్రాంతాలకు అనుసంధానించే రోడ్డు పనులు ముమ్మరంగా చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. దేశానికి మాజీ ప్రధాని వాజ్‌పేయీ చేసిన అపూర్వ సేవలను స్మరించుకుంటూ రాజధానిలో ఆయన విగ్రహాన్ని ఈనెల 25న ఆవిష్కరిస్తామని చెప్పారు.
Andhra Pradesh Capital
Amaravati Development
Infrastructure Projects
Minister Narayana
Amaravati Roads
Capital Region Development
రహదారుల అభివృద్ధి
రాజధాని ప్రాంతం
వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ
Scroll for the next article