Entertainment27th Dec 04:54 PMSunil Byrisetty1 min read

పుష్ప 2 తొక్కిసలాటపై చార్జిషీట్

'పుష్ప 2' సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్‌

పుష్ప 2 తొక్కిసలాటపై చార్జిషీట్
'పుష్ప 2' సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్‌తో సహా మొత్తం 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తమ నివేదికలో నిర్ధారించారు. ఛార్జ్‌షీట్‌లో సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని ఏ1గా, హీరో అల్లు అర్జున్‌ను ఏ11గా చేర్చారు. వీరితో పాటు ముగ్గురు మేనేజర్లు, ఎనిమిది మంది బౌన్సర్ల పేర్లను కూడా నిందితుల జాబితాలో పొందుపరిచారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను కూడా ఛార్జ్‌షీట్‌లో చేర్చారు.
Pushpa 2
Hyderabad
Sandhya Theater
Allu Arjun
brawl case
police charge sheet
theater management
చట్టపరమైన చర్య
సినిమా ఘటన
నేర కేసు
Scroll for the next article