Technology9th Jun 05:56 PMSunil Byrisetty1 min read
ఐఐటీ జేఈఈలో 4వ ర్యాంక్ కొట్టేసిన చాట్‌జీపీటీ!
దేశంలోనే అత్యంత కష్టమైన పరీక్షల్లో ఒకటైన ఐఐటీ జేఈఈని క్రాక్ చేయాలని ఏటా లక్షల మంది ప్రయత్నిస్తుంటారు. అలాంటి క్లిష్టమైన పరీక్షను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పని చేసే చాట్‌జీపీటీ
దేశంలోనే అత్యంత కష్టమైన పరీక్షల్లో ఒకటైన ఐఐటీ జేఈఈని క్రాక్ చేయాలని ఏటా లక్షల మంది ప్రయత్నిస్తుంటారు. అలాంటి క్లిష్టమైన పరీక్షను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పని చేసే చాట్‌జీపీటీ రాస్తే ఎలా ఉంటుంది? ఇదే సందేహం ఐఐటీ ఖరగ్‌పూర్ ఇంజినీర్ అనుష్క ఆశ్వికి కలిగింది. ఆమె చాట్‌జీపీటీ ఓ3 మోడల్‌కు ఈ పరీక్ష పెట్టింది. చాట్‌జీపీటీ అద్భుతంగా సాల్వ్ చేసిందని, ఫలితాలు చూసి షాకయ్యానని ఆమె తెలిపింది. 360 మార్కులకు గాను ఏకంగా 327 మార్కులు స్కోర్ చేసిందని తెలిపింది. ఈ మార్కులతో చాట్‌జీపీటీకి ఆలిండియా 4వ ర్యాంకు వస్తుందని పేర్కొంది. మొత్తంగా అత్యంత క్లిష్టమైన పరీక్ష అయినా చాట్‌జీపీటీకి ఈజీనే అని గుర్తించింది.