News13th Jul 11:27 AMSunil Byrisetty2 min read
ఆధార్ మార్పునకు కొత్త రూల్స్..!
కొత్త ఆధార్ పొందాలనుకున్నా, పాత ఆధార్‌లో పేరు, చిరునామా లేదా ఫోటోను మార్చాలనుకుంటే, ఇకనుంచి కొత్త నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. 2025-26 సంవత్సరానికి ఆధార్ అప్డేట్ చేయడానికి అవసరమై
కొత్త ఆధార్ పొందాలనుకున్నా, పాత ఆధార్‌లో పేరు, చిరునామా లేదా ఫోటోను మార్చాలనుకుంటే, ఇకనుంచి కొత్త నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. 2025-26 సంవత్సరానికి ఆధార్ అప్డేట్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్ల కొత్త జాబితాను యూఐడీఏఐ విడుదల చేసింది.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) విడుదల చేసిన నిబంధనల ప్రకారం మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఒకరి పేరు మీద రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆధార్ నంబర్లు ఉంటే, మొదట జారీ చేసిన ఆధార్ మాత్రమే చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. ఆధార్ కోసం నాలుగు డాక్యుమెంట్లు అవసరం.
1. ఐడెంటిటీ ప్రూఫ్ : దీని కింద, మీరు పాస్‌పోర్ట్, పాన్ కార్డు (చెల్లుబాటు అయ్యే ఇ-పాన్ కార్డ్), ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వం / ప్రభుత్వ సంస్థ జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు, నరేగా జాబ్ కార్డు, పెన్షనర్ గుర్తింపు కార్డు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం / ఎక్స్-సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ కార్డు, ట్రాన్స్జెండర్ ఐడి కార్డును డాక్యుమెంట్‌గా చూపించవచ్చు.
2. అడ్రస్ ప్రూఫ్ : విద్యుత్ / నీరు / గ్యాస్ / ల్యాండ్‌లైన్ బిల్లు (ఇది 3 నెలల కంటే తక్కువ), బ్యాంక్ పాస్‌బుక్ లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, అద్దె ఒప్పందం(రిజిస్టర్డ్), పెన్షన్ డాక్యుమెంట్, రాష్ట్ర / కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రాన్ని చిరునామా రుజువు కోసం ఉపయోగించవచ్చు.
3. బర్త్ సర్టిఫికేట్ : స్కూల్ మార్క్ షీట్, పాస్‌పోర్ట్, మీ పుట్టిన తేదీ రాసిన పెన్షన్ డాక్యుమెంట్, పుట్టిన తేదీతో కూడిన రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ సర్టిఫికేట్ ఉపయోగించవచ్చు.
4. రుజువు (అవసరమైతే).