News7th Nov 12:11 PMSunil Byrisetty1 min read
చెన్నై ‘వందేభారత్' నరసాపురం వరకు పొడిగింపు
చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్(20677/20678) ఎక్స్ ప్రెస్ రైలును భీమవరం మీదుగా నరసాపురం వరకు పొడిగించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో నరసాపురం ఎం
చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్(20677/20678) ఎక్స్ ప్రెస్ రైలును భీమవరం మీదుగా నరసాపురం వరకు పొడిగించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో నరసాపురం ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర రైల్వే మంత్రికి వినతి అందజేశారు. ప్రస్తుత నరసాపురం ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపించారు. దీంతో నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు ఆదేశాలు జారీచేసింది. త్వరలో ఈ సర్వీసు మొదలుకానుంది. ప్రస్తుతం చెన్నై సెంట్రల్లో ఉదయం 5.30 గంటలకు బయలుదేరే 'వందేభారత్' రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టేషన్ల మీదుగా విజయవాడకు 12.10కి చేరుతోంది. పొడిగించిన సర్వీసు 11.45 గంటలకు విజయవాడకు చేరుకొని, అక్కడి నుంచి 11.50కి బయల్దేరి.. మధ్యాహ్నం 12.25కు గుడివాడ, 1.30కి భీమవరం, 2.10కి నరసాపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.50 గంటలకు నరసాపురంలో బయలుదేరి 3.20కి భీమవరం, 4.10కి గుడివాడ, 4.50కి విజయవాడకు చేరుతుంది. ఇక్కడి నుంచి 4.55 గంటలకు బయలుదేరి, సాయంత్రం 5.20 తెనాలి, 6.30ఒంగోలు,7.40కి నెల్లూరు, 8.50కి గూడూరు, 9.50కు రేణిగుంట మీదుగా రాత్రి 11.45 గంటలకు చెన్నై సెంట్రల్ స్టేషన్కు చేరుతుంది.