News30th Apr 04:57 PMSunil Byrisetty1 min read
శ్రీకాళహస్తీశ్వరుడి సేవలో శివాజి వారసుడు!
తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి దేవస్థానానికి మరాఠా సింహం, ఛత్రపతి శివాజి మహరాజ్ వారసుడు విచ్చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. భారతజాతి ముద్దుబిడ్డగా కొనియాడ
తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి దేవస్థానానికి మరాఠా సింహం, ఛత్రపతి శివాజి మహరాజ్ వారసుడు విచ్చేశారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
భారతజాతి ముద్దుబిడ్డగా కొనియాడే ఛత్రపతి శివాజీ మనవడు సంభాజిరాజే ఛత్రపతి రావడంతో ఆలయం వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు.
ముందుగా వారికి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికారు.
అనంతరం ప్రత్యేక రాహు కేతు పూజ, స్వామి అమ్మవార్ల దర్శనానంతరం వేద పండితులతో ఆశీర్వదాలు, తీర్థప్రసాదాలు తీసుకున్నారు.
అనంతరం శ్రీకాళహస్తికే ప్రఖ్యాతిగాంచిన కలంకారి కండువాను కప్పి వినాయక స్వామి ప్రతిమను అందజేశారు.