News19th Dec 11:39 AMSunil Byrisetty1 min read

కేంద్ర జల్‌ శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు, నిధుల విడుదలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర జల్‌ శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో ఢిల్లీలో సమావేశమయ్యారు. విభజన హామీల్

కేంద్ర జల్‌ శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు, నిధుల విడుదలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర జల్‌ శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో ఢిల్లీలో సమావేశమయ్యారు. విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణ ఆర్థిక సాయం అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. జల్‌ జీవన్‌ మిషన్‌కు 2025–26 ఆర్థిక సంవత్సరానికి అదనంగా రూ.1,000 కోట్లు కేటాయించాలని కోరారు. PMKSY–RRR పథకం కింద చెరువులు, కాలువల పునరుద్ధరణకు కేంద్ర నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్ అనుమతులు మంజూరు చేయాలని, వంశధార ట్రిబ్యునల్ తీర్పుల అమలుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుపై కర్నాటక ముందుకెళ్లకుండా కేంద్రం అడ్డుకోవాలని సీఎం కోరారు.
Andhra Pradesh News
Chandrababu Naidu
C R Patil
Jal Shakti Ministry
Irrigation Projects
Polavaram Project
Jal Jeevan Mission
జల్‌ జీవన్‌ మిషన్
పథకం
కేంద్ర నిధులు
రాష్ట్ర అభివృద్ధి
Scroll for the next article