News30th Jan 11:19 AMSunil Byrisetty1 min read

క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు

ఏపీలో వివిధ రకాల క్యాన్సర్లను నియంత్రించేలా కార్యాచరణ చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో కేన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించిందని అన్

క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు
ఏపీలో వివిధ రకాల క్యాన్సర్లను నియంత్రించేలా కార్యాచరణ చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో కేన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించిందని అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణులు, ఏపీ ప్రభుత్వ సలహాదారు డా. నోరి దత్తాత్రేయుడితో కలిసి కాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్ ను సీఎం విడుదల చేశారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి రూపొందించిన ఈ అట్లాస్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశలో 2.9 కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి నమోదు చేసిన వివరాలతో ఈ అట్లాస్ ను రూపొందించారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఏ ప్రాంతంలో ఎంతమంది, ఏ రకమైన క్యాన్సర్ రోగులు ఉన్నారో గుర్తించేందుకు, స్థానికంగా చికిత్సలు అందించేందుకు వీలుగా సమాచారం తెలిసేలా ఈ అట్లాస్ కు రూపకల్పన చేశారు.
Andhra Pradesh Government
Cancer Atlas
Chief Minister Chandrababu Naidu
Cancer Control
Cancer Screening
గ్రామస్థాయి స్క్రీనింగ్
28 జిల్లాలు
ఆరోగ్య సంరక్షణ
క్యాన్సర్ అవగాహన
Scroll for the next article