News27th Dec 03:20 PMSunil Byrisetty1 min read
జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత నెల 27న జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిం
జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత నెల 27న జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై నెల రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించింది. నేటితో గడువు ముగుస్తుండటంతో ప్రాథమిక నోటిఫికేషన్ అనంతరం వ్యక్తమైన అభ్యంతరాలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు రాగా... వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. మార్పులు చేర్పుల తర్వాత ప్రభుత్వం డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ ఇవ్వనుంది.