News20th May 03:37 PMSunil Byrisetty1 min read
22న ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 22వ తేదీ ఢిల్లీ వెళుతున్నారు. 23వ తేదీన పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. అదే విధంగా రాష్ట్రానికి పెట్టుబడులకు సంబంధించి పలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 22వ తేదీ ఢిల్లీ వెళుతున్నారు.
23వ తేదీన పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు.
అదే విధంగా రాష్ట్రానికి పెట్టుబడులకు సంబంధించి పలువురు పారిశ్రామిక వేత్తలతో కూడా సీఎం భేటీ కానున్నారు.
24వ తేదీ ఉదయం 9.30 గంటలకు భారత్ మండపంలో జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సిఎం పాల్గొంటారు.
అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణమై అమరావతి చేరుకుంటారు.
ఏపీలో మద్యం కుంభకోణం మంటలు రేపుతున్న వేళ సీఎం చంద్రబాబు ఢిల్లీ ప్రయాణం సర్వత్రా చర్చ రేపుతోంది