News30th Apr 03:24 PMSunil Byrisetty1 min read
దుర్గేష్.. ఆల్ ది బెస్ట్ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆల్ ది బెస్ట్ తెలిపారు. వియత్నాంలో జరిగే బుద్ద భగవానుని అవశేషాల ప్రదర్శన కార్యక్రమ నిర్వహణ బాధ్యతను కేంద్ర మైనార్ట
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
వియత్నాంలో జరిగే బుద్ద భగవానుని అవశేషాల ప్రదర్శన కార్యక్రమ నిర్వహణ బాధ్యతను కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు, మంత్రి కందుల దుర్గేష్‌కి అప్పగిస్తూ పీఎంవో ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మంత్రి కందుల దుర్గేష్ మర్యాదపూర్వకంగా కలిశారు.
నేడు న్యూఢిల్లీకి బయలుదేరుతున్న క్రమంలో నిర్వహణ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని సూచిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
మే 1 నుంచి 6 వరకు వియత్నాం పర్యటనలో మంత్రి దుర్గేష్ ఉండనున్నారు.
అనంతరం న్యూఢిల్లీ మీదుగా విజయవాడకు చేరుకుంటారు.