News18th Apr 12:46 PMSunil Byrisetty1 min read
పోరుబాటలో ఫీల్డ్ అసిస్టెంట్లు
ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు తమ సమస్యలు పరిష్కరించకుంటే విధులు బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్ట
ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు తమ సమస్యలు పరిష్కరించకుంటే విధులు బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.
తమ ఆందోళనలో భాగంగా నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.
తమ సమస్యలను కూటమి సర్కార్ పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరిస్తామంటూ ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారని, ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ నెల 28వ తేదీలోగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే పూర్తి స్థాయిలో విధులు బహిష్కరించి, సమ్మె బాట పడతామని స్పష్టం చేస్తున్నారు.
ఈ మేరకు అధికారులకు సమ్మె నోటీసు ఇచ్చారు