News12th Jul 10:37 AMSunil Byrisetty1 min read
ప్రజలతో సంప్రదించి ‘పిల్లలే సంపద’
జనాభా నియంత్రణ కాకుండా జనాభా సంరక్షణ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సమీప భవిష్యత్తులోనే ‘పిల్లలే సంపద’ అనే మాటను నిజం చేసి చూపుత
జనాభా నియంత్రణ కాకుండా జనాభా సంరక్షణ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సమీప భవిష్యత్తులోనే ‘పిల్లలే సంపద’ అనే మాటను నిజం చేసి చూపుతామని సీఎం అన్నారు. గతంలో జనాభా నియంత్రణ కోసం ప్రభుత్వాలు పనిచేశాయని గుర్తు చేశారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయని సీఎం స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా ఇప్పుడు విధానాలను మార్చుకోవాల్సిన తరుణం వచ్చేసిందని ఆయన స్పష్టం చేశారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఫెర్టిలిటీ రేట్ గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందని... భవిష్యత్తులో జనంతోనే అభివృద్ధి, జనాభా ఉంటేనే భవిష్యత్తుగా పరిస్థితులు మారతాయని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 40కిపైగా దేశాల్లో జనాభా తగ్గిపోతోందని ఆయన అన్నారు. దేశమంటే మట్టి కాదోయ్-దేశమంటే మనుషులోయ్ అని గురజాడ చెప్పిన మాటల్ని మరో మారు గుర్తు చేసుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఎలాంటి అభివృద్ధి అయినా జనాభా ఉంటేనే అది సార్ధకం అవుతుందని ముఖ్యమంత్రి అన్నారు.