News18th Dec 01:32 PMSunil Byrisetty1 min read

ఢిల్లీ కాలుష్యానికి చైనా చిట్కా

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి చైనా చిట్కా ఉపయోగించనున్నారు. ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయిన నేపథ్యంలో ఈ గండం నుంచి గట్టెక్కడానికి చైనీస్‌ ఎంబసీ ప్రభుత్వానికి కొన్ని

ఢిల్లీ కాలుష్యానికి చైనా చిట్కా
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి చైనా చిట్కా ఉపయోగించనున్నారు. ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయిన నేపథ్యంలో ఈ గండం నుంచి గట్టెక్కడానికి చైనీస్‌ ఎంబసీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. మొదటి దశలో వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు బీజింగ్‌ కాలుష్యాన్ని వెదజల్లే పాత వాహనాలను తొలగించి యూరో 6 నిబంధనలను కఠినంగా అమలు చేశారు. లైసెన్స్‌-ప్లేట్‌ లాటరీలు, బేసి, సరి సంఖ్య తేదీల్లో వాహనాలపై ఆంక్షలు, మెట్రో, ప్రజారవాణా వ్యవస్థలో భారీ పెట్టుబడులు పెట్టడం, విద్యుత్తు బస్సులు, వాహనాల వినియోగాన్ని పెద్ద ఎత్తున తీసుకురావడం వంటి చర్యలను సూచించారు. రెండవ దశలో పారిశ్రామిక పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించాలని తెలిపారు. బీజింగ్‌లో 3,000కు పైగా భారీ పరిశ్రమల మూసివేత లేక వేరే ప్రాంతాలకు తరలింపు జరిగినట్లు చెప్పారు. చైనాలోని అతి పెద్ద ఉక్కు తయారీ సంస్థల్లో ఒకటైన షౌగాంగ్‌ని వేరే చోటుకు తరలించడంతో 20 శాతం వాయు కాలుష్యం తగ్గినట్లు వివరించారు. ఖాళీ చేసిన ఫ్యాక్టరీల స్థలాలను పార్కులు, వాణిజ్య జోన్లు, టెక్‌ హబ్‌లుగా మార్చాలని సూచించారు.
Delhi Air Pollution
China Pollution Control
Clean Air Initiatives
Vehicular Pollution
Industrial Reforms
Euro 6 Standards
Electric Buses
Urban Planning
Environmental Policy
Beijing Model
Sustainable Cities
Scroll for the next article