News29th Jul 09:52 AMSunil Byrisetty1 min read
ఎపిలో చిప్ డిజైనింగ్ సెంటర్
గూగుల్ క్లౌడ్ డైరక్టర్ డ్రూ బ్రైన్స్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. విశాఖపట్నంలో డేటా సిటీని ఏర్పాటు చేసేందుకు గూగుల్ సంస్థ గత ఏడాది డి
గూగుల్ క్లౌడ్ డైరక్టర్ డ్రూ బ్రైన్స్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. విశాఖపట్నంలో డేటా సిటీని ఏర్పాటు చేసేందుకు గూగుల్ సంస్థ గత ఏడాది డిసెంబర్ 11న ఎపి ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చుకుందన్నారు. రాష్ట్రంలోని యువతను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఎఐ) వినియోగాన్ని ప్రోత్సహించడానికి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడానికి గూగుల్ మరో ఎంఓయు చేసుకుందని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా గూగుల్ డేటా సెంటర్ పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టండని కోరారు. ఎయిర్ కనెక్టివిటీ, పోర్టు కనెక్టివిటీ ఉన్నందున అటువంటి కార్యకలాపాలకు ఎపి అనుకూలంగా ఉంటుందని మంత్రి లోకేష్ చెప్పారు. దీనిపై గూగుల్ క్లైడ్ డైరక్టర్ డ్రూ బ్రైన్స్ స్పందిస్తూ... ఇప్పటికే ఎంఓయులు చేసుకున్న ప్రాజెక్టులతోపాటు ఎపి ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.