TTD7th Aug 08:54 AMSunil Byrisetty1 min read
టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ కు రూ. కోటి విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ కు రూ. కోటి విరాళం అందజేశారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో కలిసి ఈ విరాళం ఇచ్చారు. టీటీడీ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చ
తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ కు రూ. కోటి విరాళం అందజేశారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో కలిసి ఈ విరాళం ఇచ్చారు.
టీటీడీ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఅర్ నాయుడును కలిసి ప్రాణదానం ట్రస్ట్ కు కోటి రూపాయల విరాళం CKPC ప్రాపర్టీస్ ఎండి చిరాగ్ పురుషోత్తం
అందజేశారు. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ద్వారా ఎందరో పేద ప్రజలకు వైద్య సహాయం అందజేసి ప్రాణ రక్షణ చేస్తోంది. గుండె, మూత్రపిండాలు, మెదడు మొదలైన ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న పేద రోగులకు ఉచిత వైద్యం అందించాలనే గొప్ప లక్ష్యంతో టిటిడి శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్‌ను ప్రారంభించింది.
ఇలాంటి గొప్ప ట్రస్ట్ కు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో కోటి విరాళం అందజేసినందుకు దాత చిరాగ్ పురుషోత్తంను చైర్మన్ అభినందించారు.