Celebrities21st Mar 10:09 AMSunil Byrisetty1 min read
ఛాన్సిస్తే చిరంజీవినీ అమ్మేస్తారేమో!
మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ నెక్స్ట్ లెవల్. ఆయన పేరు చెబితే ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోతారు. చిరు మాటైనా, చిరు వార్తయినా నెటిజన్లకు వైరల్ కంటెంటే. సరిగ్గా ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని స
మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ నెక్స్ట్ లెవల్. ఆయన పేరు చెబితే ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోతారు.
చిరు మాటైనా, చిరు వార్తయినా నెటిజన్లకు వైరల్ కంటెంటే.
సరిగ్గా ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని స్కాముకి తెర తీశారు కొందరు.
చిరంజీవిని హౌస్ ఆఫ్ కామన్స్- యూకే పార్లమెంట్‌లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు.
చిరు లండన్ పర్యటన పేరుతో డబ్బు చేసుకోవాలని కొందరు రంగంలోకి దిగారు.
ఫ్యాన్ మీట్ పేరుతో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారు.
ఈ విషయం ఏకంగా చిరంజీవి నోటీసుకి చేరడంతో సీరియస్ అయ్యారు.
ఎక్స్ వేదికగా స్పందించారు.
ప్రియమైన అభిమానులారా..! యూకేలో నన్ను కలిసేందుకు మీరు చూపిన ప్రేమ, వాత్సల్యం నా హృదయాన్ని తాకింది.
ఈ క్రమంలో ఫ్యాన్ మీటింగ్ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేయడం నా దృష్టికి వచ్చింది.
ఇలాంటి అనుచిత ప్రవర్తను నేను అస్సలు ఒప్పుకోను.
దీన్ని ఖండిస్తున్నా. ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే, వెంటనే తిరిగి వారికి ఇచ్చేయండి.
ఇలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండండి.
ఎప్పుడు, ఎక్కడా కూడా నేను ఇలాంటి వాటిని ప్రోత్సహించనని గుర్తించండి.
మన మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం వెలకట్టలేనిది. నేను ఇలాంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ అస్సలు ఒప్పుకోను.
మన ఆత్మీయ కలయికలను స్వచ్ఛంగా, స్వలాభార్జనకు దూరంగా ఉంచుదామని ట్వీట్లో చిరు పేర్కొన్నారు.