Telangana12th Oct 11:18 AMSunil Byrisetty1 min read
సజ్జనార్ ను కలిసిన చిరంజీవి!
సినీ నటుడు చిరంజీవి.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ సీపీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో సజ్జనార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి
సినీ నటుడు చిరంజీవి.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ సీపీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో సజ్జనార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో సైబరాబాద్ సీపీగా పనిచేసిన సమయంలో, కరోనా సమయంలో ప్లాస్మా దానం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇద్దరూ కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్’ చిత్రంలో చిరంజీవి నటిస్తున్నారు. నయనతార కథానాయిక. సంక్రాంతి కానుకగా ఈ మూవీ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘విశ్వంభర’లోనూ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా రానుంది. వీటి తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ హైఓల్టేజ్ యాక్షన్ మూవీలో చిరు సందడి చేయనున్నారు.