Telangana11th Dec 02:13 PMSunil Byrisetty1 min read

మహీంద్రా.. మిమ్మల్ని చూస్తే రతన్ టాటా గుర్తొస్తారన్న చిరు

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’లో తనకెదురైన అనుభవంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను కలవడంపై, మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రశంసలు

మహీంద్రా.. మిమ్మల్ని చూస్తే రతన్ టాటా గుర్తొస్తారన్న చిరు
‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’లో తనకెదురైన అనుభవంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను కలవడంపై, మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రశంసలు వైరల్‌గా మారాయి. సమ్మిట్ అనంతరం ఆనంద్ మహీంద్రా ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదికగా చిరంజీవితో దిగిన ఫొటోను షేర్ చేశారు. "సీఎం రేవంత్ రెడ్డితో విజన్ 2047 గురించి చర్చించాక, మెగాస్టార్ చిరంజీవిని కలవడం ఊహించని సర్‌ప్రైజ్. ఆయన ఒక లెజెండ్. కానీ, ఆయనలోని వినయం, ప్రతీ విషయంపై చూపిన నిజమైన ఆసక్తి నన్ను మరింతగా ఆకట్టుకున్నాయి. నేర్చుకోవాలనే తపన, వినయంతో వినడమే ఏ రంగంలోనైనా శాశ్వత విజయానికి పునాది" అని మహీంద్రా తన పోస్టులో పేర్కొన్నారు. మహీంద్రా ప్రశంసలపై చిరంజీవి కూడా స్పందించారు. "డియర్ ఆనంద్ మహీంద్రా గారూ, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీ స్వభావం ఎందరికో ఆదర్శనీయం. మీరు చాలాసార్లు నాకు రతన్ టాటాను గుర్తుకు తెస్తారు. ఆయన తన విలువలతో స్ఫూర్తిగా నిలిస్తే, మీరు సేవా కార్యక్రమాలలో చూపుతున్న నిబద్ధత ఎంతో మందికి ఆదర్శం. మీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది" అని చిరంజీవి బదులిచ్చారు.
Telugu News
Celebrity News
Chiranjeevi
Anand Mahindra
Ratan Tata
Telangana Rising Global Summit 2025
Revanth Reddy
Vision 2047
Business Leaders
Viral Tweet
Scroll for the next article