Entertainment10th Dec 05:19 PMSunil Byrisetty1 min read
ప్రపంచ సినిమా హైదరాబాద్ వైపేనన్న చిరంజీవి
ఫ్యూచర్ సిటీపై మెగా స్టార్ చిరంజీవి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఫ్యూచర్ సిటీలో జరిగిన “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” కార్యక్రమానికి తనను అతిథిగా ఆహ్వానించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్
ఫ్యూచర్ సిటీపై మెగా స్టార్ చిరంజీవి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఫ్యూచర్ సిటీలో జరిగిన “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” కార్యక్రమానికి తనను అతిథిగా ఆహ్వానించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. “తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ లో భాగంగా.. అన్ని రంగాలతో పాటు సినిమా రంగానికి సైతం ప్రాముఖ్యతను ఇస్తూ.. హైదరాబాద్ ను ఫిల్మ్, ఎంటర్టైన్మెంట్ గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దాలనే విజన్ చాలా గొప్పదని కొనియాడారు. ఈ మహత్తర కార్యాచరణలో తన దిశా నిర్దేశం కోరడం.. ఎంతో ఆనందదాయకమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విజన్ అలాగే ప్రభుత్వ ప్రోత్సాహంతో మన నుంచి మరెన్నో “World Class Projects” రూపుదిద్దాలని, ప్రపంచ సినిమా హైదరాబాద్ పై దృష్టి సారిస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నానని ట్వీట్ లో పేర్కొన్నారు.