News8th Sep 04:22 PMSunil Byrisetty1 min read

చిరంజీవి కుమార్తెకు దుర్గ గుడి పదవి!

మెగాస్టార్ చిరంజీవి కుమార్తెకు విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం పదవి దక్కింది. విజయవాడ దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలుగా చిరంజీవి కుమార్తెను నియమిస్తూ ప్రభుత్వం ఉ

చిరంజీవి కుమార్తెకు దుర్గ గుడి పదవి!
మెగాస్టార్ చిరంజీవి కుమార్తెకు విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం పదవి దక్కింది. విజయవాడ దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలుగా చిరంజీవి కుమార్తెను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. చిరంజీవి కుమార్తె 'సుస్మిత'ను దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలుగా నియమిస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు.ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రత్యేక ఉత్సవాల్లో సుస్మిత భాగస్వామ్యమై తగిన సూచనలు, సలహాలు అందించనున్నారు. కాగా ఇటీవల తెలంగాణలోని యాదాద్రి ఆలయంలో చిరంజీవి సతీమణి సురేఖను సభ్యురాలిగా నియమించారు.
Andhra Pradesh
Chiranjeevi
Sushmita Konidela
Kanaka Durga Temple
Vijayawada
Durga Temple Trust Board
ఆంధ్రప్రదేశ్
దేవాదాయ శాఖ
ఇంద్రకీలాద్రి
ఆలయ అభివృద్ధి
సురేఖ
యాదాద్రి
Scroll for the next article