Entertainment29th Aug 02:18 PMSunil Byrisetty1 min read

అభిమాని రాజేశ్వరికి చిరు గిఫ్ట్!

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మానవత్వాన్ని చాటారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని పట్టణానికి చెందిన చిరంజీవి వీరాభిమాని రాజేశ్వరి, మెగాస్టార్ ని కలవాలనే కలతో సైకిల్‌పై హైదరాబాద్‌కు సాహసో

అభిమాని రాజేశ్వరికి చిరు గిఫ్ట్!
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మానవత్వాన్ని చాటారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని పట్టణానికి చెందిన చిరంజీవి వీరాభిమాని రాజేశ్వరి, మెగాస్టార్ ని కలవాలనే కలతో సైకిల్‌పై హైదరాబాద్‌కు సాహసోపేత ప్రయాణం మొదలుపెట్టారు. ఎన్నో శారీరక, మానసిక సవాళ్లు ఎదురైనా చిరంజీవిపై వున్న అపారమైన అభిమానమే ఆమెను విజయవంతంగా ముందుకు నడిపింది. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి, రాజేశ్వరిని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఆమె అంకితభావానికి, తనను చేరుకోవడానికి చేసిన కృషికి చలించిపోయిన చిరు, ఒక చిరస్మరణీయ జ్ఞాపకాన్ని ఇచ్చారు. ఆ సందర్భంలో రాజేశ్వరి, మెగాస్టార్ కి రాఖీ కట్టగా, ఆమెకు ఆశీస్సులు అందించి అందమైన సాంప్రదాయ చీరను బహుమతిగా ఇచ్చారు. రాజేశ్వరి పిల్లల విద్య కోసం, వారి భవిష్యత్ లో వెలుగునింపడం కోసం పూర్తి స్థాయి ఆర్థిక సహాయం అందించనున్నట్లు హామీ ఇచ్చారు చిరు.
Tollywood
Chiranjeevi
Mega Star
Fan Story
Rajeshwari
Hyderabad
Humanity
Rakhi
Gift
Saree
Education Support
Inspiration
Celebrity Kindness
అభిమాని రాజేశ్వరి
చిరంజీవి హృదయపూర్వక బహుమతి
Scroll for the next article