Politics6th Apr 11:47 AMSunil Byrisetty1 min read
దళితుల కాళ్ల పట్టుకుని.. జిల్లా కలెక్టర్ క్షమాపణ
భారత రాజ్యాంగ నిర్మాతలలో ఒకరైన బాబూ జగ్జీవన్ రావ్ జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రభుత్వ అధికారిక వేడుకలకు దళితులను ఆహ్వానించకపోవడంపై చిత్తూరులో నిరసనలు వెల్లువెత్తాయి. జయంతి వేడుకల్
భారత రాజ్యాంగ నిర్మాతలలో ఒకరైన బాబూ జగ్జీవన్ రావ్ జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రభుత్వ అధికారిక వేడుకలకు దళితులను ఆహ్వానించకపోవడంపై చిత్తూరులో నిరసనలు వెల్లువెత్తాయి.
జయంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక అధికారుల అలసత్వం బహిర్గతమైంది.
దళిత సంఘాల నాయకులు ఈ విషయంలో ఆగ్రహంతో స్పందించి, కార్యాచరణకు దిగారు.
కూటమి పాలనలో తాము తీవ్రంగా నిర్లక్ష్యానికి గురవుతున్నామని దళితులు పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో అక్కడికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌కు దళిత సంఘాల నాయకులు తమ అభ్యంతరాలు తెలిపారు.
వారి మనోభావాలను విన్న కలెక్టర్, ఇది కావాలని చేసిన తప్పు కాదని, కింది స్థాయి అధికారుల తప్పిదమేనని తెలిపారు.
తప్పు జరిగినందుకు బాధితుల కాళ్ల మీద పడి స్వయంగా క్షమాపణలు కోరారు.
ఘటనపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.