News16th Apr 03:39 PMSunil Byrisetty1 min read
సింహాచలం నరసింహుడి చందనోత్సవంపై సమీక్ష
ఈ నెల 30వ తేదీన జరగనున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ సమీక్షా సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ
ఈ నెల 30వ తేదీన జరగనున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించబడింది.
ఈ సమీక్షా సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో మంత్రుల బృందం, దేవాదాయ శాఖ కార్యదర్శి వినయ్ చంద్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, మ్యారీ టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
చందనోత్సవానికి సంబంధించి భక్తుల సౌకర్యాలు, ట్రాఫిక్, భద్రత, శుభ్రత వంటి అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించబడింది.
ఉత్సవం శాంతియుతంగా సాగేలా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రులు బృందం పలు సూచనలు ఇచ్చింది.