News25th Dec 04:41 PMSunil Byrisetty1 min read
నటుడు రాజ్ కమార్ ఆధ్వర్యంలో క్రిస్టమస్ వేడుకలు
బెజవాడ బార్ అసోసియేషన్ లో క్రిస్టమస్ వేడుకలను ఘనంగా జరిపారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సినీ నటుడు రాజకుమార్ విచ్చేసి బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశ
బెజవాడ బార్ అసోసియేషన్ లో క్రిస్టమస్ వేడుకలను ఘనంగా జరిపారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సినీ నటుడు రాజకుమార్ విచ్చేసి బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ తన సినీ జీవితంలో తన మొదటి సినిమా అయిన అమ్మ రాజీనామా అనే సినిమా ఈ విజయవాడలోనే షూటింగ్ జరిగిందని 27 సినిమాలలో హీరోగా, మొత్తం 74 సినిమాలలో నటించానని, టీవీ మెగా సీరియల్స్ లో నటించానని, అనుకోకుండా విజయవాడ వచ్చి ప్రతిష్టాత్మకమైన బెజవాడ బార్ న్యాయవాదుల సమక్షంలో క్రిస్టమస్ పండగ జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. తన ద్వితీయ కుమారుడు వేల్పుల ఆదిత్య సుప్రీంకోర్టులో న్యాయవాదిగా చేస్తున్నారని, సభ్యులందరూ బెజవాడ బార్ సభ్యులందరూ తనను తన కొడుకును ఆశీర్వదించాలని కోరారు. తెలుగుదేశం రాష్ట్ర ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ సినీ రంగంలో హీరోగా ఉంటూ కూడా తన కుమారుడిని న్యాయవాద వృత్తిలోకి తీసుకొని వచ్చారన్నారు.