News24th Sep 11:32 AMSunil Byrisetty1 min read
సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసు పంపిన సీఐ
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐగా పనిచేసిన జె. శంకరయ్య సంచలనం సృష్టించారు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరువునష్టం దావా నోటీసు పంపారు. ప్రస్తుతం రాజకీయ
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐగా పనిచేసిన జె. శంకరయ్య సంచలనం సృష్టించారు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరువునష్టం దావా నోటీసు పంపారు. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ఆరోపణలు చేశారని శంకరయ్య ఆరోపించారు. న్యాయవాది జి. ధరణేశ్వరరెడ్డి ద్వారా చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపారు. శాసనసభ వేదికగా తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, తన ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు రూ. 1.45 కోట్ల పరిహారం చెల్లించాలని ఆ నోటీసులో శంకరయ్య పేర్కొన్నారు.