Film News5th Mar 04:52 PMSunil Byrisetty1 min read

రామ్ గోపాల్ వర్మకు మ‌రోసారి సీఐడీ నోటీసులు

వివాదాస్ప‌ద‌ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సీఐడీ అధికారులు మ‌రోసారి నోటీసులు పంపారు. 2019లో ఆయ‌న తీసిన‌ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' మూవీపై అన‌కాప‌ల్లి, మంగ‌ళ‌గిరి, ఒంగోలులో కే

రామ్ గోపాల్ వర్మకు మ‌రోసారి సీఐడీ నోటీసులు
వివాదాస్ప‌ద‌ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సీఐడీ అధికారులు మ‌రోసారి నోటీసులు పంపారు. 2019లో ఆయ‌న తీసిన‌ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' మూవీపై అన‌కాప‌ల్లి, మంగ‌ళ‌గిరి, ఒంగోలులో కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని బుధవారం సీఐడీ అధికారులు మ‌రోసారి నోటీసులు జారీ చేశారు. అయితే ఈ కేసులో ఇంత‌కుముందు జారీ అయిన నోటీసుల‌పై ఆయ‌న తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ వేశారు. ప్ర‌స్తుతం ఈ కేసు న్యాయ‌స్థానంలో విచార‌ణ ద‌శ‌లో ఉండ‌గానే ఆర్‌జీవీకి సీఐడీ నుంచి ఇప్పుడు మ‌రోసారి నోటీసులు అందాయి. ఈ కేసుకు సంబంధించి వ‌ర్మ‌కు గుంటూరు సీఐడీ అధికారులు గ‌త నెల 10న నోటీసులు జారీ చేశారు. కానీ ఆయ‌న విచార‌ణ‌కు డుమ్మా కొట్టి, త‌న న్యాయ‌వాదిని సీఐడీ ఆఫీస్‌కు పంపించారు. సినిమా ప‌నుల‌తో బిజీగా ఉన్నందున విచార‌ణ‌కు రాలేన‌ని, త‌న‌కు 8 రోజుల గ‌డువు కావాల‌ని కోరారు. కానీ వ‌ర్మ‌కు సీఐడీ అధికారులు మ‌రోసారి నోటీసులు పంపించ‌డం గ‌మ‌నార్హం.
Ram gopal Varma
CID
Notices
Tollywood
రామ్ గోపాల్ వర్మ
నోటీసులు
టాలీవుడ్
Scroll for the next article