News14th Nov 03:33 PMSunil Byrisetty1 min read

సీఐఐ సమ్మిట్ సూపర్ హిట్.. రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లువ

విశాఖపట్నం వేదికగా గత రెండు రోజులుగా పండగ వాతావరణంలో జరిగిన సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు అద్భుతమైన విజయం సాధించిందని, ఇది రాష్ట్ర అభివృద్ధిలో ఒక గొప్ప శుభపరిణామమని విజయనగరం ఎంపీ కల

సీఐఐ సమ్మిట్ సూపర్ హిట్.. రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లువ
విశాఖపట్నం వేదికగా గత రెండు రోజులుగా పండగ వాతావరణంలో జరిగిన సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు అద్భుతమైన విజయం సాధించిందని, ఇది రాష్ట్ర అభివృద్ధిలో ఒక గొప్ప శుభపరిణామమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. గత ఐదేళ్ల పాలనలో అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో, దూరదృష్టితో చేస్తున్న ప్రయత్నాలు నేడు ఫలించాయని ఎంపీ అన్నారు. ముఖ్యమంత్రి విజనరీ ఆలోచనలకు, మంత్రి నారా లోకేష్ గారి చురుకైన కార్యాచరణ తోడవడంతో దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు తరలివచ్చి, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చారని తెలిపారు. లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం ఎంతో సంతోషకరమన్నారు. సాధారణంగా పెట్టుబడిదారుల సదస్సులంటే కేవలం కంపెనీల రాక, వ్యాపార ఒప్పందాలకే పరిమితమవుతాయని, కానీ ఈ సదస్సు ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా ముఖ్యమంత్రి చంద్రబాబు 'పి4' విధానాన్ని ప్రోత్సహించడం చారిత్రాత్మకమని కలిశెట్టి కొనియాడారు.
Scroll for the next article