News10th Jul 11:26 AMSunil Byrisetty1 min read
విశాఖలో CII సమ్మిట్.. పెట్టుబడులపై స్పీడ్!
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(CII) 30వ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో జరగనుంది. నవంబరు 14, 15 తేదీల్లో ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సమ్మిట్ సన్నాహక ఏర్పాట్లపై సచివాలయంల
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(CII) 30వ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో జరగనుంది. నవంబరు 14, 15 తేదీల్లో ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సమ్మిట్ సన్నాహక ఏర్పాట్లపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. రిజిస్ట్రేషన్, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను ఆన్లైన్ చేయాలన్నారు. సదస్సును విజయవంతం చేసేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టాలని పరిశ్రమల శాఖ అధికారులు, విశాఖ కలెక్టర్ను ఆదేశించారు. ఈ సదస్సుతో పెట్టుబడిదారులు పెద్ద సంఖ్యలో విశాఖవైపు చూడనున్నారు.