News13th Nov 09:46 AMSunil Byrisetty1 min read
రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా సీఐఐ సదస్సు
విశాఖపట్నంలో 30వ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న రాత
విశాఖపట్నంలో 30వ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న రాత్రే విశాఖకు చేరుకున్నారు. ఈ రోజు నుంచి శనివారం వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో పలు దేశాల ప్రతినిధులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశాలు, ఒప్పందాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి. రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.
నోవోటెల్‌లో జరిగే ‘ఇండియా-యూరప్ బిజినెస్ రౌండ్ టేబుల్’ సమావేశంతో సీఎం కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. యూరోపియన్ పెట్టుబడులు, గ్రీన్ షిఫ్ట్, సస్టెయినబుల్ ఇన్నోవేషన్ వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. అనంతరం తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో పాటు ఎస్పీపీ పంప్స్, రెన్యూపవన్, మురుగప్ప గ్రూపు, హీరో ఫ్యూచర్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు.