News14th Nov 11:54 AMSunil Byrisetty1 min read

సీఐఐ సమ్మిట్.. రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం

విశాఖ నగరం కీలక ఘట్టానికి వేదికైంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు ఈరోజు ఉదయం అట్టహాసంగా ప్రారంభమైంది. భారత ఉపరాష్ట్రప

సీఐఐ సమ్మిట్.. రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
విశాఖ నగరం కీలక ఘట్టానికి వేదికైంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు ఈరోజు ఉదయం అట్టహాసంగా ప్రారంభమైంది. భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఈ సదస్సును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సమ్మిట్ ద్వారా సుమారు రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సదస్సు ప్రారంభానికి ముందే సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో రూ. 3.65 లక్షల కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదరడం ప్రభుత్వ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు దేశ, విదేశాల నుంచి భారీ స్పందన లభించింది. 50కి పైగా దేశాల నుంచి మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల సీఎక్స్ఓలు సహా సుమారు 3000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. రెండు రోజుల పాటు మొత్తం 45 సెషన్లు జరగనుండగా తొలి రోజు 25 సెషన్లను నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
Andhra Pradesh Investments
CII Summit 2025
Vizag Summit
Partnership Summit 2025
Chandrababu Naidu
Investment MoUs
Indian Economy
Global Delegates
Business Summit
AP Development
Scroll for the next article