Entertainment6th Aug 11:24 AMSunil Byrisetty1 min read
కొలిక్కిరాని నిర్మాతలు, కార్మికుల చర్చలు
టాలీవుడ్‌లో సినీ కార్మికుల బంద్ మూడో రోజు కొనసాగుతోంది. ఫెడరేషన్ నేతలు నేడు చిరంజీవిని కలిసే అవకాశం ఉంది. 30 శాతం వేతనాల పెంపుపైనే వారి ప్రధాన చర్చ జరగనుంది. అలాగే కార్మికుల బాధలను
టాలీవుడ్‌లో సినీ కార్మికుల బంద్ మూడో రోజు కొనసాగుతోంది. ఫెడరేషన్ నేతలు నేడు చిరంజీవిని కలిసే అవకాశం ఉంది. 30 శాతం వేతనాల పెంపుపైనే వారి ప్రధాన చర్చ జరగనుంది. అలాగే కార్మికుల బాధలను ఫెడరేషన్ చిరంజీవికి వివరించనుంది. 12 గంటలపాటు పనిచేస్తున్నారన్న విషయాన్ని నాయకులు చిరంజీవి దగ్గర ప్రస్తావించనున్నారు. ఇప్పటికే గిల్డ్ నిర్మాతలు చిరంజీవిని కలిసిన విషయం తెలిసిందే. కార్మికుల డిమాండ్లపై గిల్డ్ నిర్మాతలు చర్చించారు. అయితే రెండు మూడు రోజులు చూసి మాట్లాడతానని చిరంజీవి వారికి చెప్పారు. నేడు చిరు-ఫిల్మ్ ఫెడరేషన్ మీటింగ్ పై ఆసక్తి నెలకొంది. మరోవైపు నేడు లేబర్ కమిషనర్ తో జరగాల్సిన ఫెడరేషన్ నేతల చర్చలు రేపటికి వాయిదా పడ్డాయి.