News7th Nov 02:32 PMSunil Byrisetty1 min read

డిసెంబరు 1న ‘చలో ఢిల్లీ’

కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబరు 1 నుంచి దేశవ్యాప్తంగా లక్ష మంది కార్మికులతో ఢిల్లీలో నిర్వహించనున్న పోరాటాన్ని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్

డిసెంబరు 1న ‘చలో ఢిల్లీ’
కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబరు 1 నుంచి దేశవ్యాప్తంగా లక్ష మంది కార్మికులతో ఢిల్లీలో నిర్వహించనున్న పోరాటాన్ని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ నరసింగరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఐదు వేల మంది కార్మికులు పాల్గొంటారని తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ... కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, కార్మిక హక్కులను పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు. పదేళ్లుగా కార్మికుల వేతనాల్లో ఎలాంటి పెరుగుదల లేదని, మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయని అన్నారు. బియ్యం, పప్పులు, నూనెల ధరలు గత మూడు నెలల్లో 50 శాతానికి పైగా పెరిగాయని పేర్కొన్నారు. అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, వీఓఏ, ఆర్‌పీ తదితర స్కీమ్‌ కార్మికులకు 2018 నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వేతనం పెంచలేదని విమర్శించారు. కార్మికుల కొనుగోలు శక్తి పెరగకుండా దేశ ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్‌ డాలర్లకు చేర్చడం వల్ల సామాన్యులకు ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. కార్పొరేట్‌ సంస్థలకు భారీ రాయితీలు కల్పిస్తూ కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు.
Scroll for the next article