News15th Sep 12:42 PMSunil Byrisetty1 min read
ముఠా కార్మికుల కూలీ రేట్లు పెంచాలి
విజయవాడ, నున్న కూరగాయల హోల్ సేల్ మార్కెట్ లో ముఠా కార్మికులు కూలీ రేట్లు పెంపుదల కోసం చేపట్టిన సమ్మె 5వ రోజుకు చేరింది. సమ్మె సందర్భంగా కార్మిక సంఘాలను యాజమాన్యం చర్చలకి పిలిచి కూల
విజయవాడ, నున్న కూరగాయల హోల్ సేల్ మార్కెట్ లో ముఠా కార్మికులు కూలీ రేట్లు పెంపుదల కోసం చేపట్టిన సమ్మె 5వ రోజుకు చేరింది. సమ్మె సందర్భంగా కార్మిక సంఘాలను యాజమాన్యం చర్చలకి పిలిచి కూలీ పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎన్.సి హెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కూరగాయల మార్కెట్లో ముఠా కార్మికుల కూలీ రేట్లు పెంపుదల ప్రతి రెండున్నర సంవత్సరాలకు పెంచి, అగ్రిమెంట్ కుదుర్చుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. చాలా రోజుల నుంచి కార్మికులు కార్మిక సంఘం నాయకులు యజమానులను కూలి రేట్ల పెంచాలని పదేపదే విన్నవించినా కూడా కూలి రేట్లు పెంచే ప్రసక్తే లేదని చెప్పటంతో సమ్మె అనివార్యం అయిందని అన్నారు. ముఠా కార్మికులకు వచ్చే కూలి చాలక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి తరుణంలో యాజమాన్యం కూలి రేట్లు పెంచి ముఠా కార్మికుల కుటుంబాలకు బాసటగా నిలవాలని కోరారు. పని కోసం నున్న మార్కెట్కు వస్తున్న కార్మికులకు ప్రయాణ ఖర్చులు పెరిగాయని అన్నారు. ఇప్పటికైనా కూలి రేట్లు పెంచేందుకు యాజమాన్యం ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు.