News15th Sep 12:21 PMSunil Byrisetty1 min read
ఆర్టీసీ విద్యుత్ బస్సులపై సీఐటీయూ ధర్నా
ఆర్టీసీలో ప్రవేశపెడుతున్న విద్యుత్ బస్సులను ఆర్టీసీ సంస్థ ద్వారానే నడపాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ ఇన్ గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా
ఆర్టీసీలో ప్రవేశపెడుతున్న విద్యుత్ బస్సులను ఆర్టీసీ సంస్థ ద్వారానే నడపాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ ఇన్ గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కుట్రలో భాగంగానే విద్యుత్ బస్సుల నిర్వహణను ‘పినాకిని’ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.సి.పి. రెడ్డి ఆరోపించారు. దశలవారీగా ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తూ.. వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఆర్టీసీ విద్యుత్ బస్సులను ప్రైవేట్ సంస్థలకు కాకుండా ఆర్టీసీ సంస్థ ద్వారానే నిర్వహించాలని, సంస్థను పరిరక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.