National23rd Jul 12:17 PMSunil Byrisetty1 min read

ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమన్న కాక్రోచ్

కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసనను కొందరు బయటి వ్యక్తులు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని అభిజిత్ దీప్కే ఆరోపణలు చేశారు.బీజేపీకి చెందిన కొందరు

ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమన్న కాక్రోచ్
కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసనను కొందరు బయటి వ్యక్తులు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని అభిజిత్ దీప్కే ఆరోపణలు చేశారు.బీజేపీకి చెందిన కొందరు వ్యక్తులు తమ నిరసనల్లో పాల్గొంటున్నారని ఆరోపించారు. నిరసనల్లో హింసాత్మక ఘటనలకు ఆ వ్యక్తులే కారణమని అభిజిత్ దీప్కే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు సివిల్ డ్రెస్‌లో వచ్చి విద్యార్థులపై దాడులు చేస్తున్నారని అభిజిత్ దీప్కే వ్యాఖ్యానించారు. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని CJP చీఫ్ అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. అయితే దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
India News
BJP
Cockroach Janata Party
CJP
Abhijit Deepke
Protest
Government Talks
Student Protest
Political Protest
ఆందోళనలు
జాతీయ వార్తలు
హింసాత్మక ఘటనలు
శాంతియుత చర్చలు
Scroll for the next article