Politics15th Sep 11:29 AMSunil Byrisetty1 min read

ఢిల్లీలో ఏపీ ఎంపీ వర్సెస్ ఐఏఎస్

ఏపీకి చెందిన సీనియర్‌ ఐఏఎస్‌, సీఎంవో ఉన్నతాధికారి కార్తికేయ మిశ్రా.. నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఢిల్లీలో నూతన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ప్

ఢిల్లీలో ఏపీ ఎంపీ వర్సెస్ ఐఏఎస్
ఏపీకి చెందిన సీనియర్‌ ఐఏఎస్‌, సీఎంవో ఉన్నతాధికారి కార్తికేయ మిశ్రా.. నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఢిల్లీలో నూతన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు వచ్చినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జన్‌పథ్‌లోని తన నివాసం నుంచి చంద్రబాబు రాష్ట్రపతి భవన్‌కు వెళ్తుండగా.. శబరి ఆయనతో మాట్లాడేందుకు తలుపు దగ్గర నిలుచున్నారు. అక్కడ మీరెందుకని మిశ్రా ఆమెను దురుసుగా ప్రశ్నించినట్లు తెలిసింది. మిశ్రా తీరుపై మనస్తాపానికి గురైన ఆమె.. మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ ఘటన ప్రస్తుతం ఢిల్లీలో హాట్‌ టాపిక్‌గా మారింది.
Andhra Pradesh
Delhi Politics
AP MP vs IAS
Chandrababu Naidu
Lokesh
Kartikeya Mishra
Baireddy Shabari
Vice President Oath
ఢిల్లీలో ఏపీ ఎంపీ వర్సెస్ ఐఏఎస్
ఢిల్లీలో ఘర్షణ
సీనియర్ ఐఏఎస్ వివాదం
Scroll for the next article