Politics24th Oct 03:15 PMSunil Byrisetty1 min read

కేశినేని, కొలికపూడి మధ్య ముదిరిన వివాదం

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య నడుస్తున్న మాటల యుద్ధంపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినప్పటికీ, ఈ వ్యవహారం స

కేశినేని, కొలికపూడి మధ్య ముదిరిన వివాదం
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య నడుస్తున్న మాటల యుద్ధంపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినప్పటికీ, ఈ వ్యవహారం సద్దుమణగడం లేదు. తాజాగా కొలికపూడి శ్రీనివాసరావు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అపాయింట్‌మెంట్ కోరడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎంపీ కేశినేని చిన్నిని లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్యే కొలికపూడి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేయడంతో ఈ వివాదం ప్రారంభమైంది. విషయం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన దుబాయ్ నుంచే పల్లా శ్రీనివాసరావుకు ఫోన్ చేసి, వివాదంలో ఉన్న నేతలతో మాట్లాడాల్సిన అవసరం లేదని, ఎవరినీ పార్టీ కార్యాలయానికి పిలవవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఇంత సీరియస్‌గా ఉన్న తరుణంలో, ఆయనే స్వయంగా జోక్యం చేసుకోవద్దని చెప్పిన తర్వాత ఎమ్మెల్యే కొలికపూడి.. పల్లా అపాయింట్‌మెంట్ కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు పల్లా శ్రీనివాసరావుతో కొలికపూడి భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Andhra Pradesh
Kesineni Chinni
Kolikapudi Srinivas Rao
Chandrababu Naidu
TDP
Vijayawada
తిరువూరు
పల్లా శ్రీనివాసరావు
రాజకీయ వివాదం
Scroll for the next article