Education18th Oct 11:19 AMSunil Byrisetty1 min read
28 నుంచి పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు
ఏపీలో ఈనెల 28 నుంచి పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అపార్ ఐడీ (ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) అమల
ఏపీలో ఈనెల 28 నుంచి పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అపార్ ఐడీ (ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. అపార్ ఐడీ లేని విద్యార్థులకు వెంటనే దానిని చేయించాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాది జరగనున్న పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఫీజు చెల్లింపుపై విద్యాశాఖ వివరాలు ప్రకటించనుంది.