Crime31st Oct 02:30 PMSunil Byrisetty1 min read

బాలికపై ఉన్మాది ఘాతుకం.. రంపంతో దాడి

అనంతపురము జిల్లా రాప్తాడులో ఉన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. టెన్త్ బాలికను రంపంతో కోసి పరారయ్యాడు. రంపంతో విచక్షణారహితంగా కోయడంతో కుడిచేయి, ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. క్లాస్‍రూమ్‍లోనే

బాలికపై ఉన్మాది ఘాతుకం.. రంపంతో దాడి
అనంతపురము జిల్లా రాప్తాడులో ఉన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. టెన్త్ బాలికను రంపంతో కోసి పరారయ్యాడు. రంపంతో విచక్షణారహితంగా కోయడంతో కుడిచేయి, ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. క్లాస్‍రూమ్‍లోనే ఘాతుకానికి పాల్పడటంతో అనంతరం బాలికను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విద్యార్థినిపై దాడిపై సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉన్మాదిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. బాధిత విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. విద్యార్థిని చికిత్స గురించి అధికారులతో మాట్లాడారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. విద్యార్థినిపై దాడి ఘటనపై హోంమంత్రి అనిత, మహిళా కమిషన్ చైర్ పర్సన్ శైలజ స్పందించి, విచారణకు ఆదేశించారు.
Scroll for the next article