News26th Aug 12:22 PMSunil Byrisetty1 min read

మట్టి వినాయక ప్ర‌తిమ‌లే పర్యావరణానికి మేలు

గణేశ్ చతుర్థి పండుగ వేడుకలు పర్యావరణహితంగా జరుపుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రజా సదన్ లో మంగళవారం పర్యావరణ ఇంజనీర

మట్టి వినాయక ప్ర‌తిమ‌లే పర్యావరణానికి మేలు
గణేశ్ చతుర్థి పండుగ వేడుకలు పర్యావరణహితంగా జరుపుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రజా సదన్ లో మంగళవారం పర్యావరణ ఇంజనీర్ బి. కరుణశ్రీ మట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలను అచ్చెన్నాయుడుకి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి అందజేశారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మట్టి వినాయక విగ్రహాలను వాడటం ద్వారా నదీ జలాలు కలుషితం కాకుండా కాపాడవచ్చని, భక్తి–ప్రకృతి రెండింటినీ పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేశారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఇంటి వద్దకే మట్టి విగ్రహాలు డెలివరీ అవుతాయని అన్నారు. మన భక్తిని ఆచరిస్తూనే పర్యావరణాన్ని కాపాడుకుందాం” అని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి – శ్రీకాకుళం ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు బి.కరుణ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకి వివరించారు.
Andhra Pradesh
Ganesh Chaturthi
Eco-friendly Ganesha
Clay Idols
Srikakulam
Kinjarapu Achchennaidu
Kinjarapu Rammohan Naidu
Pollution Control
Environment Protection
మట్టి వినాయక ప్ర‌తిమ‌లే పర్యావరణానికి మేలు
Scroll for the next article