News9th Oct 03:07 PMSunil Byrisetty1 min read

లక్ష్యమే విజయానికి తొలి మెట్టు!

జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితులు, విద్యాసంస్థల నేపథ్యం అడ్డంకులు కావని, స్పష్టమైన లక్ష్యం, పట్టుదల, నిరంతర కృషి ఉంటే అనుకున్న విజయాలను సాధించవచ్చని

లక్ష్యమే విజయానికి తొలి మెట్టు!
జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితులు, విద్యాసంస్థల నేపథ్యం అడ్డంకులు కావని, స్పష్టమైన లక్ష్యం, పట్టుదల, నిరంతర కృషి ఉంటే అనుకున్న విజయాలను సాధించవచ్చని ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకే రవికృష్ణ అన్నారు. గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహించిన ‘దీక్షారంభ్’ ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో విద్యనభ్యసించిన తాను, ఎన్నో ఆర్థిక సవాళ్లను అధిగమించి సివిల్ సర్వీసెస్‌తో పాటు ఆరు పోటీ పరీక్షల్లో విజయం సాధించిన తన జీవిత ప్రయాణాన్ని ఆకే రవికృష్ణ విద్యార్థినులతో పంచుకున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా లక్ష్యంపై దృష్టి నిలిపి, క్రమశిక్షణతో కృషి చేస్తే విజయం సాధ్యమవుతుందన్నారు. ‘ఫోర్ మదర్స్ – వన్ కన్సర్న్’ అంశాన్ని ప్రస్తావిస్తూ డ్రగ్స్‌కు బానిసలై జీవితాలను నాశనం చేసుకున్న యువతకు సంబంధించిన వాస్తవ సంఘటనలను వివరించారు. బీటెక్ పూర్తి చేసిన విద్యార్థికి పదేళ్ల జైలు శిక్ష పడిన ఘటన, ఉద్యోగం సాధించిన యువకుడు డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఉదంతం, గంజాయికి బానిసలైన అక్కాతమ్ముళ్ల ఉదంతాలను ప్రస్తావిస్తూ మాదకద్రవ్యాల ప్రభావం వ్యక్తులకే పరిమితం కాకుండా మొత్తం కుటుంబాలను సంక్షోభంలోకి నెడుతుందని హెచ్చరించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, ఇతరులను కూడా మాదకద్రవ్యాల బారిన పడకుండా చైతన్యపరచాలని విద్యార్థినులకు పిలుపునిచ్చారు.
Scroll for the next article