News30th Aug 10:58 AMSunil Byrisetty1 min read

జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. ఏడుగురు మృతి.. పలువురు గల్లంతు

ప్రస్తుతం క్లౌడ్ బరస్టుల కాలం నడుస్తోంది. ఇటీవల వరదలు జమ్మూకాశ్మీర్‌ను ముంచెత్తిన విషయం తెలిసిందే. ఆ విపత్తు నుంచి తేరుకోకముందే క్లౌడ్ బరస్ట్‌ విరుచుకుపడింది. వరదలతో తిండి తిప్పలు

జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. ఏడుగురు మృతి.. పలువురు గల్లంతు
ప్రస్తుతం క్లౌడ్ బరస్టుల కాలం నడుస్తోంది. ఇటీవల వరదలు జమ్మూకాశ్మీర్‌ను ముంచెత్తిన విషయం తెలిసిందే. ఆ విపత్తు నుంచి తేరుకోకముందే క్లౌడ్ బరస్ట్‌ విరుచుకుపడింది. వరదలతో తిండి తిప్పలు లేక అల్లాడిపోతుంటే.. వరుస క్లౌడ్ బరస్ట్‌లతో ప్రజలు అతలాకుతలం అయిపోతున్నారు. తాజాగా శనివారం కూడా మరో క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. రాంబాన్‌ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఏడుగురు చనిపోగా.. పలువురు గల్లంతైనట్లుగా సమాచారం. ఇక ఇళ్లులు ధ్వంసమయ్యాయి. ఇక జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆర్మీ సాయంతో సహాయ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇక పూంచ్, కిష్త్వార్, జమ్మూ, రాంబన్, ఉధంపూర్ జిల్లాల్లో శనివారం, ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది.
Jammu Kashmir Floods
Cloudburst
Ramban District
Flash Floods
Natural Disaster
Heavy Rainfall
Orange Alert
Indian Army Rescue
Poonch
Kishtwar
Udhampur
జమ్మూలో మళ్లీ క్లౌడ్ బరస్ట్
పలువురు మృతి
Scroll for the next article