National17th Aug 12:07 PMSunil Byrisetty1 min read

జమ్మూకశ్మీర్లో మళ్లీ క్లౌడ్ బరస్ట్!

జమ్మూకశ్మీర్ను మేఘ విస్ఫోటాలు వనికిస్తున్నాయి. కిస్త్వాడ్ జిల్లాలో ఇటీవల సంభవించిన క్లౌడ్ బరస్ట్.. పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఉపద్రవాన్ని మరువక ముందే కథువా జిల్లాలోని ఘాటీ గ్రా

జమ్మూకశ్మీర్లో మళ్లీ క్లౌడ్ బరస్ట్!
జమ్మూకశ్మీర్ను మేఘ విస్ఫోటాలు వనికిస్తున్నాయి. కిస్త్వాడ్ జిల్లాలో ఇటీవల సంభవించిన క్లౌడ్ బరస్ట్.. పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఉపద్రవాన్ని మరువక ముందే కథువా జిల్లాలోని ఘాటీ గ్రామంలో మరోసారి మేఘ విస్ఫోటం సంభవించింది. ఈ విపత్తులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ విస్ఫోటం సంభవించింది. ఎస్ఈఆర్ఎఫ్ బృందం ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.
India news
Jammu and Kashmir
Cloudburst
Natural Disaster
Kathua District
Kishtwar
Heavy Rainfall
Floods
SERF Rescue Operations
Tragedy
Loss of Lives
భారీ వర్షాలు
వరదలు
ఎస్ఈఆర్ఎఫ్ సహాయక చర్యలు
Scroll for the next article