News22nd Oct 07:39 PMSunil Byrisetty1 min read
సెమీ కండక్టర్ల తయారీ యూనిట్లతో ఎకోసిస్టం
సీఎం అధ్యక్షతన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఎస్ఐపీబీ సమావేశానికి మంత్రులు లోకేష్, టీజీ భరత్, అనగాని, గొట్టిపాటి, నారాయణ, దుర్గేష్ వర్చువల్గా హాజరయ్
సీఎం అధ్యక్షతన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఎస్ఐపీబీ సమావేశానికి మంత్రులు లోకేష్, టీజీ భరత్, అనగాని, గొట్టిపాటి, నారాయణ, దుర్గేష్ వర్చువల్గా హాజరయ్యారు. పరిశ్రమలు, ఇంధనశాఖ, పర్యాటకం, ఐటీ రంగాల్లో పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చించారు. ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలికసౌకర్యాల కల్పన రంగాల్లో పెట్టుబడులపై చర్చ జరిపారు. గత ఒప్పందాలు పెట్టుబడులుగా మారి ఉత్పత్తి చేపట్టడంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. 714 ఒప్పందాల్లో 519 ప్రాజెక్టుల కార్యాచరణ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. పెట్టుబడుల సదస్సు కోసం విశాఖలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.సెమీ కండక్టర్ల తయారీ యూనిట్లతో ఎకోసిస్టం ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.