News8th May 10:55 AMSunil Byrisetty1 min read
నేడు ఏపీ కేబినెట్ సమావేశం
నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, అధికారులు ఉదయం 11 గంటలకు భేటీ కానున్నారు. సబ్ కమిటీ సిఫార్సులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతి రీ-లాంచ్
నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, అధికారులు ఉదయం 11 గంటలకు భేటీ కానున్నారు.
సబ్ కమిటీ సిఫార్సులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
అమరావతి రీ-లాంచ్ ప్రాజెక్టులతో పాటు.. పలు పరిశ్రమలకు స్థలాల కేటాయింపుపై చర్చించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు కేబినెట్ ధన్యవాదాలు తెలపనుంది.
అలాగే 47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలుపుతారు.
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలుపై చర్చిస్తారు.
దేశ సరిహద్దులో యుద్ధ వాతావరణంపైనా సమాలోచనలు జరపనున్నారు.
తీరప్రాంత భద్రతపై ప్రత్యేకంగా చర్చించనున్న కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకోనుంది.