Entertainment10th Jun 01:41 PMSunil Byrisetty1 min read
బాలయ్యకు శుభాకాంక్షల వెల్లువ!
నటుడు, హిందూపురం MLA నందమూరి బాలకృష్ణకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, పలువురు మంత్రులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వెండి తెర కథానాయకునిగా క
నటుడు, హిందూపురం MLA నందమూరి బాలకృష్ణకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, పలువురు మంత్రులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వెండి తెర కథానాయకునిగా కోట్లాది అభిమానులను పొందిన బాలయ్య... నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాని సీఎం చంద్రబాబు అన్నారు. సిల్వర్ స్క్రీన్ పై లెజెండ్ , పొలిటికల్ స్క్రీన్ పై అన్ స్టాపబుల్.. ప్రజల గుండెల్లో బాలయ్య... నా ముద్దుల మామయ్య నందమూరి బాలకృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని మంత్రి లోకేష్.. సామాజిక మాధ్యమం 'ఎక్స్ ' వేదికగా పోస్ట్ చేశారు. సినిమాల్లో చారిత్రక, జానపద, పౌరాణిక పాత్రలు పోషించి బాలకృష్ణ ప్రేక్షకుల మెప్పు పొందారని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజా జీవితంలో.. హిందూపురం అభివృద్ధికి కృషిచేస్తున్న బాలకృష్ణకు... సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.