News2nd Jul 06:03 PMSunil Byrisetty1 min read
దేశంలో ఆదర్శ నియోజకవర్గంగా కుప్పం
కుప్పాన్ని దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. కుప్పంలో పర్యటించిన ఆయన, 'స్వర్ణ కుప్పం' ప్రాజెక్టులో భాగంగా పలు అభివృద్ధి, సంక్షేమ
కుప్పాన్ని దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. కుప్పంలో పర్యటించిన ఆయన, 'స్వర్ణ కుప్పం' ప్రాజెక్టులో భాగంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ప్రజావేదిక సభలో మాట్లాడుతూ, విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని తిరిగి వికాసం వైపు నడిపిస్తున్నామని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన హంద్రీనీవా నీళ్లను ఈ ఏడాదిలోనే అందిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. రూ. 3,890 కోట్ల వ్యయంతో హంద్రీనీవా పనులను పూర్తి చేసి, నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు పారిస్తామని తెలిపారు. "అభివృద్ధి చేసే వారికే సంక్షేమం గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. అప్పులు తెచ్చి సంక్షేమం చేస్తామనడం సరైన పరిపాలన కాదు," అని ఆయన అన్నారు. అభివృద్ధి ద్వారా ఆదాయాన్ని సృష్టించి, దానిని సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడమే సరైన ఆర్థిక విధానమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం గత ఏడాదిగా ఇదే పాలసీని అనుసరిస్తోందని వివరించారు.